నల్గొండ కాంగ్రెస్ లో గుబులు..అందుకేనా..?
తెలంగాణలో నల్గొండ రాజకీయాలు వేరే లెవెల్ లో ఉంటాయి.తలపండిన నేతలకు నెలవు నల్గొండ..సమైక్య పాలనలో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నల్గొండ తెలంగాణ ఏర్పాటు తర్వాత కొంత ప్రాభవం కోల్పోయింది.కేసీఆర్ ప్రభావంతో నల్గొండలో 10 ఏండ్లు గులాబీ రాజ్యం నడిచింది.నల్లగొండలో బీఆర్ఎస్ అగ్రనేత ఐన జగదీశ్వర్ రెడ్డి తన ఆధిపత్యాన్ని కొనసాగించారు..
నల్గొండ లో 2023 లో కాంగ్రెస్ జెండా రెప రెపలాడింది.కొమటిరెడ్డి బ్రదర్స్ దాటికి నల్గొండలో బీఆర్ఎస్ ఒక్కసీటుకే పరిమితమైంది..నల్గొండ రాజకీయాల్లో మరోసారి కొమటిరెడ్డి బ్రదర్స్ తమ మార్క్ రాజకీయాలు మొదలు పెట్టారు..అయితే ఇదంతా ఒకవైపు అయితే ఏడాది పాలన పూర్తయ్యాక నల్గొండ కాంగ్రెస్ డిపెన్స్ లో పడినట్టు తెలుస్తుంది.పూర్తిగా ఆత్మరక్షణ దోరణి కాంగ్రెస్ లో కనబడుతుంది.ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ అంటే జంకుతున్నారు కాంగ్రెస్ మంత్రులు,ఎమ్మెల్యేలు.ఇటివల జరుగుతున్న పరిణామాలే అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి..
భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే కరెంట్ కట్ చేసారు..మొన్న నల్గొండలో కేటీఆర్ రైతు దీక్ష చేపట్ట తలచితే దీక్షకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారు..ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా జంకుతున్నారు కాంగ్రెస్ నేతలు అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది..కొమటిరెడ్డి బ్రదర్స్ మీదకు గంభీరంగా కనిపించినా ప్రజల్లో వస్తున్న వ్యతిరేఖత,పథకాల అమలులో జాప్యం,ప్రశ్నించడంలో బీఆర్ఎస్ ముందుండటంతో ,బీఆర్ఎస్ పుంజుకుని ఎక్కడ తమ కుర్చీకి ఎసరు పెడుతుందో అని లోలోపల భయపడుతున్నట్టు తెలుస్తుంది.మరి నల్గొండ కాంగ్రెస్ లో గులాబీ గుబులు ఎప్పుడు తొలగుతుందో వేచి చూడాలి..