తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ…!
బీఆర్ఎస్ పార్టీ నల్గోండలో నిర్వహించతలపెట్టిన రైతు మహాధర్నకు ప్రభుత్వం అనుమతి నిరాకరించిన సంగతి తెల్సిందే. జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతుండటం.. సంక్రాంతి పండుగ నేపథ్యలో జాతీయ రహాదారి రద్ధీగా ఉండటంతో బీఆర్ఎస్ మహాధర్నాకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ఎస్పీ తెలియజేశారు. దీనిపై మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ “తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయి.
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయడం,పరిపాలన చేయడం చేతకాక నిరసనలు వ్యక్తం చేస్తామంటే అనుమతి నిరాకరిస్తున్నారు.ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన పని చేయటం పార్టీల హక్కు.బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్న ప్రభుత్వం అడ్డుకుంటుంది.కేటీఆర్ ఏ కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వం రేవంత్ రెడ్డికి ఎందుకు వణుకు పుడుతుంది.రైతులను మోసం చేసినందుకు బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తుంది.
రేపు నల్గొండలో సభ నిర్వహిస్తామంటే ఈరోజు పోలీసులు అనుమతి నిరాకరించారు.రైతు భరోసా రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రైతులను మోసం చేసింది.కృష్ణ గోదావరిలో నీళ్లు ఉన్న ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది.కేటీఆర్ ఎక్కడికి వెళ్ళినా శాంతియుతంగానే ప్రజలు కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ఎంత అడ్డుకున్న రేపటి దీక్ష కొనసాగుతుంది.ఇది మా హక్కు అని తెలిపారు.