లోకేశ్ డిప్యూటీ సీఎం కాదు సీఎం ..!
![లోకేశ్ డిప్యూటీ సీఎం కాదు సీఎం ..!](https://www.singidi.com/wp-content/uploads/2025/01/nara-lokesh-1-850x560.jpg)
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. మంత్రి నారా లోకేష్ నాయుడుని నియమించాలని మాజీల నుండి తాజా ఎమ్మెల్యేల వరకు అందరూ తమ తమ డిమాండ్ ను విన్పిస్తున్న సంగతి తెల్సిందే.
టీడీపీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి.. ఎమ్మెల్యే అయిన సోమిరెడ్డి చంద్రమోహాన్ రెడ్డి నుండి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ వరకు అందరూ నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తాజాగా రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇంకో అడుగు ముందేసి లోకేష్ డిప్యూటీ సీఎం కాదు సీఎం కావాలి. డిప్యూటీ సీఎం అవ్వాలన్నా.. సీఎం అవ్వాలన్నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇష్టం. కూటమి పార్టీ నేతలకు తెల్సు ఎవరికి ఎప్పుడు ఏ స్థానం ఇవ్వాలో అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
![](https://www.singidi.com/wp-content/uploads/2024/12/E-Paper-Coming-Soon.png)