బుమ్రా కు మరో ఘనత..!
ఇటీవల ఆసీస్ జట్టుతో ముగిసిన బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికైన స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
డిసెంబర్ నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును బుమ్రా సొంతం చేసుకున్నారు. గత నెలలో 3 మ్యాచ్ లలోనే బుమ్రా 22 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే..
ఈ సీరిస్ ను టీమిండియా ఘోరంగా ఫెయిలైందని ఇంట బయట విమర్శల వర్షం కురిసింది. మహిళల విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నారు.