లోకేశ్ గిఫ్ట్ – బ్రాహ్మాణి రిప్లయ్..!
ఏపీ మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు తన సతీమణి బ్రాహ్మాణి కి సంక్రాంతి పండుగ వేళ మంగళగిరి నేతన్నలు తయారు చేసిన చేనేత చీరను బాహుమతిగా ఇచ్చారు.
మంగళగిరి నేతన్నల నైపుణ్యం అద్భుతం. వారికి అండగా నిలుద్దాము అని మంత్రి లోకేశ్ నాయుడు తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు.
దీనికి ఆయన సతీమణి నారా బ్రాహ్మాణి సమాధానమిస్తూ ” లోకేశ్ మనసంతా మంగళగిరిలోనే ఉంటుంది. అవకాశం ఉన్న ప్రతి చోటా చేనేతను ఆయన ప్రమోట్ చేశ్తారు. నేతన్నలపై అభిమానం మాటల్లో కాకుండా ఇలా చేతల్లో చూపిస్తారు ” అని తెలిపారు.