మాజీ మంత్రి కేటీఆర్ పై మరో కేసు నమోదు..!
నిన్న గురువారం ఏసీబీ విచారణకు హాజరైన మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పోలీసులు మరో కేసును నమోదు చేశారు.
ఏసీబీ విచారణకు హాజరైన మాజీ మంత్రి కేటీఆర్ విచారణానంతరం భారీ ర్యాలీగా ఏసీబీ కార్యాలయం నుండి తెలంగాణ భవన్ కు వెళ్ళారు.
దీంతో ర్యాలీకి ఎలాంటి అనుమతులు ముందుగా తీసుకోలేదనే కారణంతో బంజారాహీల్స్ పోలీసులు కేసును నమోదు చేశారు. కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్, మన్నె గోవర్ధన్ రెడ్డి, ముఠా జయసింహా, మన్నె క్రిశాంక్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ లపై కేసు నమోదు చేశారు.