తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్..!
తెలంగాణ రాష్ట్రంలో ఎల్లుండి శుక్రవారం పదో తారీఖు నుండి ఆరోగ్య శ్రీ సేవలు బంద్ కానున్నట్లు తెలుస్తోంది. తమకు పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించకపోతే ఈ సేవలను నిలిపేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్య సంఘం తేల్చి చెప్పినట్లు సమాచారం.
గత ఏడాదిగా ఆరోగ్య శ్రీ,ఈహెచ్ఎస్ ,జేహెచ్ఎస్ కింద రూ.100కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నట్లు వాళ్లు తెలిపారు. దీంతో ఏడాదిగా ఆసుపత్రులు నడిపే పరిస్థుతులు లేకుండా పోయాయని వారు వాపోతున్నారు.
ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి బకాయిలను చెల్లిస్తే సేవలుంటాయని పేర్కొన్నరు. మరోవైపు ఏడాదిలో రూ.900కోట్లను చెల్లించాము. మరో రూ.450-500కోట్లు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.