రైతు భరోసా పూర్తి స్థాయిలో అమలు చేయాలి.!
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు భరోసా కల్పించాలని భారత రాష్ట్ర జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు దాస్యం విజయ్ భాస్కర్ గారు డిమాండ్ చేశారు. బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల అరెస్ట్ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
పార్టీ ఆఫీసులోనే నిర్బంధించారు. పోలీసులకు, విజయ్ భాస్కర్ గారికి వాగ్వాదం చేటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన రైతు డిక్లరేషన్ అమలు చేయమని ప్రశ్నిస్తే అక్రమ అరెస్ట్‌లు ఏంటని అన్నారు. ప్రజా పాలన అని కాంగ్రెస్ నియంతృత్వ పాలనను కొనసాగిస్తోందని తెలిపారు.
కాంగ్రెస్ 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేసే వరకు ప్రజల తరపున పోరాడుతామని అన్నారు. బీఆర్ఎస్ శ్రేణుల అక్రమ అరెస్ట్‌ను ఖండించారు. నిర్బంధాలతో ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తప్పించుకోలేరని అన్నారు. ఆయన వెంట మధు, నవీన్, కిషోర్, ఉదిత్, జేకే, స్నేహిత్, రాజు, సోను, చంద్రమౌళి గౌడ్, చిన్నా, వేణు, రవి తదితరులు ఉన్నారు.