కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్.!
ఇటీవల సంధ్య సినిమా హాల్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెల్సిందే. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్ చికిత్స పొందుతున్నాడు..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శ్రీతేజ్ ను పరామర్శించడానికి షరతులతో కూడిన అనుమతిచ్చారు చిక్కడపల్లి పోలీసులు..దీంతో ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్‌ను నేడు కిమ్స్ ఆసుపత్రికెళ్లి పరామర్శించనున్నరు అల్లు అర్జున్..
దాదాపు 35 రోజులుగా కిమ్స్ ఆస్పత్రిలోనే శ్రీతేజ్ చికిత్స పొందుతున్నారు.. అల్లు అర్జున్ పరామర్శ నేపథ్యంలో కిమ్స్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు..