తెలంగాణ కమలం దళపతి ఎవరూ..?
తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియ మిస్తారు? ఈ నియామకం ఎప్పుడు జరుగుతుంది? అనేది ఆశావహులతో పాటు బీజేపీ సీనియర్ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా మరోవైపు తెలంగాణ బీజేపీ స్టేట్ ఇంఛార్జ్ సునీల్ బన్సల్ స్వయంగా రంగంలోకి దిగడం ఇప్పుడు ప్రాధాన్య తను సంతరించుకుంది. రంగంలోకి దిగిన సునీల్ బన్సల్.. ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తు న్నారు.
ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో సునీల్ బన్సల్ ఆ పార్టీ నేతలతో భేటీ కానున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ నేతలతో సునీల్ బన్సల్ వరుసగా భేటీ కావడం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఆసక్తిని రేపుతోంది.
తెలంగాణలో బీజేపీ గెలుపే లక్ష్యంగా జాతీయ నాయకత్వం ప్రణాళికలు రచిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని జాతీయ నాయకత్వం యోచిస్తోంది.