రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసిన హారీష్ రావు…!

 రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసిన హారీష్ రావు…!

బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన హరీశ్ రావు గురించి తెలియని వ్యక్తి ఉండడు. విషయ పరిజ్ఞానంతో ఫర్ఫెక్ట్ నాలెడ్జ్ తో ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయగల దిట్ట హరీశ్ రావు.కేసీఆర్ ప్రభుత్వంలో ఇరిగేషన్,ఆర్థిక,వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సక్సెస్ ఫుల్ మినిష్టర్ గా పేరుతెచ్చుకున్నారు.

ప్రతిపక్షంలోకి వచ్చాక అసెంబ్లీలో భయట అదికారపక్షాన్ని హడలెత్తిస్తున్నారు హరీశ్ రావు.ప్రతీ రోజు ఏదో ఒక సబ్జెక్ట్ తో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి ని తన ట్రాప్ లోకి దింపుకుని బురిడీ కొట్టించారు.రుణమాఫీ అంతో ఇంతో అయిందంటే అది హరీశ్ రావు వ్యూహమే అని జనంలో చర్చించుకుంటారు..

అయితే తాజాగా మరోమారు హరీశ్ రావు తన మార్క్ ను చాటుకున్నారు.కాంగ్రేస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రగతి భవన్ కంచెలు తొలగించి ప్రజావాణి కార్యక్రమాన్ని నిత్యం కొనసాగిస్తామని ప్రచారం చేసింది.చెప్పినట్టుగానే కంచెలు తొలగించి తొలిరోజు ప్రజావాణి ఏర్పాటు చేసింది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి కాసేపు ప్రజావాణిలో పాల్గొని వెల్లారు.తర్వాత ఏమైందో ఏమో అటు వైపు చూడలేదు.మరి ప్రజావాణి పరిస్థితి ఏంటో తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో హరీశ్ రావు ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని సేకరించారు.

2024 డిసెంబర్ 9 నాటికి ప్రజల నుండి 82955 పిటిషన్లు వస్తే అందులో కేవలం 43,272 పిటిషన్లు మాత్రమే గ్రీవెన్సెస్ కిందకి వస్తాయని,మిగతాయి పరిదిలోనివి చెబుతున్నారట.ఆ 43272 పిర్యాదులలో 27,215 మాత్రమే పరిష్కారమైనా అందులో వాస్తవం లేదని హరీశ్ రావు ఆదారాలతో భయటపెట్టారు..అసలు అది ప్రజావాణి కాదు ప్రజాపాలనా కాదు అది ముమ్మాటికి ప్రజాపీడన అని హరీశ్ రావు విమర్శించారు.హరీశ్ రావు ఇలా చాకచక్యంగా ప్రభుత్వం చేస్తున్న తప్పిదాన్ని ఆధారాలతో భయటపెట్టడంతో ప్రభుత్వం కాస్త ఇరుకున పడినట్టు సమాచారం ఏది ఏమైన వ్యూహాత్మకంగా వ్యవహరించటంలో హరీశ్ రావు దిట్ట అని మరోమారు తెలిపోయింది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *