అది నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా..!
దివంగత మాజీ ప్రధానమంత్రులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల పాలనలో బీసీలకు అన్యాయమే జరిగింది. మండల్ కమీషన్ ను ఎందుకు ఏర్పాటు చేయలేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పాలించింది ఎక్కువగా కాంగ్రెస్ పార్టీనే..
కాంగ్రెస్ పాలనలో బీసీలకు అన్యాయం జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్ ,బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా స్థానిక సంస్థలకు.. పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది.
నేను చెప్పింది తప్పని రుజువు చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ నేతలకు బహిరంగ సవాల్ విసిరారు. ఈరోజు శనివారం ఇందిరా పార్కులో నిర్వహిస్తున్న బీసీ మహాసభ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ వ్యాఖ్యలు చేశారు.