తెలంగాణలో ఉప ఎన్నికలు…!
Telangana: తెలంగాణలో మరోమారు ఉప ఎన్నికలు రానున్నాయా..?. రాజకీయ రణరంగం మరోమారు వేడెక్కనుందా..? .అంటే అవుననే సమాదానం వినిపిస్తుంది.కాంగ్రేస్ పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో అదికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుండి గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలలో 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రేస్ లో చేర్చుకుంది.
దీంతో బీఆర్ఎస్ బలం 29 కి తగ్గింది.పిరాయింపులపై అదికార ప్రతిపక్షాల విమర్శలు, ప్రతివిమర్శల నడిచాయి.బీఆర్ఎస్ పార్టీ పార్టీ పిరాయింపు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.దీన్ని పరిశీరించిన హైకోర్ట్ స్పీకర్ ని నిర్ణయం తీసుకోవాలంది.స్పీకర్ ఈ నిర్ణయాన్ని తాత్సారం చేస్తూ వస్తున్నారు.
అయితే నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్ ఆసక్తికర వాఖ్యలు చేసారు..ఈ ఏడాది రాష్ట్రంలో ఉప ఎన్నికలు తద్యమని పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలన్నారు.
పార్టీ పిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకోవటం ఆలస్యం చేస్తున్నందున దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు వెల్లి పిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేదాకా పోరాడతామని ఆయన అన్నారు.దీంతో రాష్ట్రంలో మరోమారు ఉప ఎన్నికలు తప్పవా అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.ఇదే జరిగితే అదికార,ప్రతిపక్షల భవితవ్యం ఈ ఉప ఎన్నికలతో తేలిపోనుంది.