వాళ్లకు రైతు భరోసా కట్..?
Telangana: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సంక్రాంతి పండుగ తర్వాత అమలు చేయనున్న సంగతి తెల్సిందే. కానీ రైతు భరోసా పథకం కేవలం పంట పండించేవాళ్లకే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సూత్రప్రాయంగా ప్రభుత్వం తెలిపింది.
మరోవైపు టాక్స్ పేయర్స్, సర్కారు ఉద్యోగులకు రైతు భరోసా ఇవ్వకూడదని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఓ రైతుకు ఎన్ని ఎకరాలున్న కానీ కేవలం ఏడు ఎకరాలకు మాత్రమే రైతుభరోసా ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.
ఈరోజు గురువారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు నేతృత్వంలో సమావేశమైన క్యాబినెట్ సబ్ కమిటీ రైతుభరోసా పై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నదో..!