పవన్ వ్యాఖ్యలకు బండి కౌంటర్..!
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురించి ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. మంగళగిరిలో మీడియా చిట్ ఛాట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏడాదిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన బాగుంది. కింది స్థాయి నుండి ఎదిగిన గొప్ప లీడర్ రేవంత్ రెడ్డి. సంక్షేమాన్ని.. అభివృద్ధిని జోడెద్దుల్లా పరుగులెట్టిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలకు కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ కౌంటరిచ్చారు. మీడియాతో మాట్లాడుతూ తాను మంచోడ్ని అని పవన్ కళ్యాణ్ కు చెవిలో చెప్పాడేమో రేవంత్ రెడ్డి .. ఏడాదిగా ఆరు గ్యారంటీలంటూ తెలంగాణ సమాజాన్ని మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
మహిళలకు ఏడాదికి రెండున్నర వేలు ఇస్తామని మోసం చేశారు. రైతు భరోసాను గాలికొదిలేశాడు.. రైతు రుణమాఫీ అరకొర చేశారు. ఏ కోణాన రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ కు మంచివాడిలా.. గొప్ప నాయకుడిలా కన్పిస్తున్నాడని ప్రశ్నించాడు. పవన్ కు రేవంత్ రెడ్డికి మధ్య కుదిరిన ఒప్పందాలేంటో తనకు తెల్వవు అని అన్నారు.