ఆన్ లైన్ లోనే రైతు భరోసా ఆప్లికేషన్లు..!
రానున్న సంక్రాంతి పండుగ నుండి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి రైతుకు రైతు భరోసా డబ్బులను వారి ఖాతాల్లో జమచేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెల్సిందే. ఇప్పటికే పలుమార్లు డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు నేతృత్వంలొని క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమయ్యారు.
తాజాగా నిన్న ఆదివారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో కూడా భేటీ అయ్యారు. ఈభేటీలో రైతు భరోసా విధివిధానాలపై చర్చించారు. పన్ను చెల్లింపుదారులకు.. ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా నుండి మినహయింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
అంతేకాకుండా కేవలం సాగు చేసే భూములకే రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని కూడా చర్చించినట్లు సమాచారం. మరోవైపు ఎన్ని ఎకరాల వరకు పరిమితి విధించాలన్నా అంశంపైనే ఇంకా క్లారిటీ రానట్లు తెలుస్తుంది. రైతు భరోసా ఆప్లికేషన్లను ఆన్ లైన్ లోనే తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.