తెలంగాణ పోలీస్ లోగో లో మార్పు..!
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించిన లోగోను మార్పుస్తూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నట్లు అధికారక జీవో తీసుకురావడమే కాకుండా సాక్షాత్తు డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎంతో అట్టహాసంగా ఆవిష్కరించారు.
తాజాగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్థానంలో తెలంగాణ పోలీస్ అనే లోగోను తీసుకు వచ్చారు. దీనికి సంబంధించిన లోగో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇంతకుముంది టీఎస్ స్థానంలో టీజీ ఉండాలని మార్పులు చేర్పులు చేపట్టిన సంగతి తెల్సిందే.