పుష్పరాజ్ తెలంగాణ పాలిటిక్స్ ను మలుపు తిప్పుతాడా..?
సంధ్య థియోటర్ సంఘటన రోజుకో మలుపు తిరుగుతుంది. ముందుగా థియోటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఆ తర్వాత ఏకంగా హీరో అల్లు అర్జున్ ను లక్ష్యంగా చేసుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఏకంగా జైళ్ల మెట్లనెక్కించింది. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ రావడం.. చిక్కడపల్లి పీఎస్ లో జరిగిన విచారణకు బన్నీ చకచకా హాజరవ్వడం.. ఈ సంఘటనకు సంబంధించి సీసీ టీవీ పుటేజీని విడుదల చేయడం జరిగిపోయింది.
అయితే ఈ సంఘటనలో ముందునుండి హీరో అల్లు అర్జున్ కు బాసటగా నిలిచిన బీఆర్ఎస్ ఆ తర్వాత వెనక్కి తగ్గినట్లు కన్పించిన కానీ తాజగా బీజేపీ ముందుకోచ్చినట్లు కన్పిస్తుంది. కేంద్ర హోం శాఖ సహయక మంత్రి బండి సంజయ్ దగ్గర నుండి ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు ల వరకు వరుస పెట్టి మరి మీడియా సమావేశాలు పెట్టీ మరి పుష్పరాజ్ కు అండగా నిలబడుతున్నారు. ఇది ఇలా ఉంటే మరోవైపు బన్నీ బెయిల్ ను క్యాన్సి ల్ చేసే పనిలో ప్రభుత్వ యంత్రాంగం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలో ఈ కేసు ఏకంగా సుప్రీం కోర్టు మెట్లు ఎక్కే సూచనలు కన్పిస్తున్నాయి. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్ధతు తప్పనిసరిగా బన్నీకి అవసరముంటుంది. ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అడ్డుపెట్టుకుని అక్కడ రాజకీయంగా బలపడాలని చూసిన బీజేపీ తెలంగాణలో బన్నీని అడ్డుపెట్టుకుని రాజకీయంగా బలపడాలని చూస్తున్నట్లు తాజా పరిణామాలు ఆర్ధమవుతున్నాయి. ఇప్పటికే బీజేపీకి మాస్ పీపుల్స్ నుండి మద్ధతు లేకపోవడం. ఉన్న నాయకుల మధ్య గొడవలు.. గ్రూపు రాజకీయాలతో బీజేపీ పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతుంది. ఇలాంటి సమయంలో తమకు దొరికిన తురుపుముక్కగా బన్నీ ను వాడుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.
కానీ ఆంధ్రాలో మాదిరిగా తెలంగాణలో సినిమా హీరోలపై ఆసక్తి ఉన్న కానీ ఆ ఆసక్తి ఓటు బ్యాంకుగా మారే అవకాశాలు చాలా తక్కువ. సినిమాలకోసం బట్టలు చింపుకున్న కానీ రాజకీయాల్లోకి వస్తే మాత్రం తమ ప్రాంతం ఆస్థిత్వం.. హక్కుల కోసం పోరాడటం ఈ నేల యొక్క మహాత్యం. అందులో బీజేపీలాంటి పార్టీను ఇక్కడ ఆదరించరని గత చరిత్ర చెబుతున్న నిజం. మరి రానున్న రోజుల్లో బన్నీ బీజేపీవైపు మల్లుతారా..?. బన్నీ తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తారా..?. చూడాలి మరి..!