రేవతి మృతిలో షాకింక్ ట్విస్ట్…!

Shocking Twist In Allu Arjun Case
సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా… ఆమె తనయుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే. ఈ ఘటనకు హీరో అల్లు అర్జున్ కారణం అని.. కేసులు నమోదు చేయడమే కాకుండా అరెస్ట్ చేసి చంచలగూడ జైలుకి తరలించారు. ఆ తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బన్నీ బయటకు వచ్చాడు. నిన్న మంగళవారం చిక్కడపల్లి పీఎస్ లో జరిగిన విచారణకు సైతం అల్లు అర్జున్ హాజరయ్యారు.
అయితే రేవతి మృతికి అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదని ఓ వీడియో ద్వారా ఆర్ధమవుతుంది. విచారణలో భాగంగా పోలీసులు విడుదల చేసిన వీడియోలో ఉన్న సమయం ప్రకారం రాత్రి 9.16నిమిషాలకు థియోటర్ లో జరిగిన తొక్కిసలాటలో స్పృహా తప్పి పడిపోయిన శ్రీతేజ్ ను కొంతమంది యువకులు బయటకి తీసుకోస్తున్నట్లు అందులో స్పష్టంగా కన్పిస్తుంది. దీంతో తొక్కిసలాట జరిగింది థియోటర్ లోపల బయట కాదని స్పష్టంగా కన్పిస్తుంది..
పోలీసులు అందించిన సాక్ష్యాధారాల ప్రకారం ఆ సమయంలో అంటే రాత్రి 9.28నిమిషాల నుండి రాత్రి గం. 9.34నిమిషాల వరకు ముషీరాబాద్ మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర అల్లు అర్జున్ ఉన్నట్లు తెలుస్తుంది. ఓ అభిమాని తీసిన ఫోటోలో సైతం రాత్రి గం.9.33నిమిషాలకు అల్లు అర్జున్ సినిమా హాల్ బయటనే ఉన్నట్లు ఆర్ధమవుతుంది.

అంటే అల్లు అర్జున్ థియోటర్ లోపలకి రాకముందే తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఈ సంఘటనపై విచారణ జరుగుతుంది కాబట్టి మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయోమో ..?