హైబీపీ తగ్గాలంటే…!
నేటి ఆధునీక జీవితంలో మారుతున్న జీవనశైలీ, ఆహారపు అలవాట్లు, సరైన వ్యాయామం లేని కారణంగా చాలా మంది హైబీపీ సమస్యతో బాధపడుతున్నారు. ఇది రానున్న రోజుల్లో మరికొన్ని ధీర్ఘకాల సమస్యలకు కారణమవుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. కాస్త వేగంగా నడవడం, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి హైబీపీ బారిన పడకుండా చేస్తాయి.
ఊబకాయంతో బాధపడేవారికి హైబీపీ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే బరువు నియంత్రణలో ఉంచేందుకు అవసరమైన వ్యాయామాలతో పాటు జంక్ ఫుడ్ తగ్గించి మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి.
ఆహారంలో ఉప్పు మోతాదును తగ్గించాలి. ఎక్కువ ఉప్పు లేకుండా చూసుకోవాలి. రుచికి అవసరమైన మేరకు మాత్రమే ఉప్పు ఉండాలి. ప్రాసెస్డ్, ప్యాక్డ్ ఫుడ్లలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. వాటిని ఎంత తక్కువగా తింటే ఆరోగ్యానికి అంత మంచిది.