బాబు కు లైన్ క్లియర్ చేస్తున్న రేవంత్ రెడ్డి..
Telangana : తెలంగాణలో ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి హామీల అమలు పక్కన పెట్టి కక్షసాదింపులు,ప్రజల ఆస్థుల ధ్వంసం,అరెస్ట్ లు,నిర్భందాల ప్రాతిపధికగానే ముందుకు సాగుతుంది.కాంగ్రేస్ చర్యలతో తెలంగాణ ప్రతిష్ట భంగమవుతూ వస్తుంది.ప్రజలకు ఇచ్చిన హామీలు మరచి ఎంత సేపు కక్షసాదింపు చర్యలు,అన్ని వర్గాలతో పంచాయతీలు ముందర వేసుకుంటుంది.
హైడ్రా కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ పడిపోయింది.హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతిని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపని పరిస్థితి దాపురించింది..అంతే కాకుండా సినీ ఇండస్ట్రీని వరుస వివాదాల్లోకి లాగుతుండటం జరుగుతుంది.
ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే సమాదానం లేదు.అయితే ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం,చంద్రబాబుకు రేవంత్ రెడ్డి శిష్యుడు అనే పేరు ఉండటంతో చంద్రబాబే ఇదంతా నడిపిస్తున్నారని కొందరు అభిప్రాయ పడుతున్నారు.సినీ ఇండస్ట్రీని ఏపీకి తరలించుకుపోయే కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది.పెట్టుబడులు సైతం ఏపీకి తరలి వెల్లేలా చంద్రబాబు వేసిన ప్రణాళికను ఇక్కడ రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని ప్రతిపక్షాలతో పాటు మేధావులు విమర్శిస్తున్నారు.