కోహ్లీ ఇండియాలో ఉండడా..?
టీమిండియా మాజీ కెప్టెన్.. స్టార్ లెజండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లి క్రికెట్ నుండి రిటైరయ్యాక లండన్ లో స్థిరపడతారని ఆయన చిన్ననాటి కోచ్ రాజు కుమార్ శర్మ తెలిపారు.
‘కుటుంబంతో కలిసి విరాట్ తన విశ్రాంత జీవనాన్ని యూకేలో గడుపుతారు. అందుకోసం ఆయన ఇప్పటికే అక్కడ ఇల్లు కొనుక్కున్నారు. త్వరలోనే పూర్తిగా లండన్ షిఫ్ట్ అవుతారు’ అని వెల్లడించారు.
కాగా.. ఇటీవలి కాలంలో కోహ్లి విరామం దొరికినప్పుడు లండన్లోనే సమయం గడుపుతున్న సంగతి తెలిసిందే. వారి కుమారుడు అకాయ్ లండన్ లోనే జన్మించాడు.