మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

 మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ…… తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రాంతంతో ఉన్న ఏకైక సంబంధం తిరుపతి. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తిరుపతిలో తలనీలాలు సమర్పించుకోవాలి, మొక్కుకోవాలి. రెండు రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేది.

రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంతో పాటు, టీటీడీ పాలకమండలి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొనసాగింపుగా దర్శనాలు జరిగాయి. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తెలంగాణ సామాన్య ప్రజలు కానీ, రాజకీయ నాయకులు కానీ, వ్యాపార వేత్తలకు డిఫరెన్స్ కనిపిస్తున్నాయి. ఇది మంచి పరిణామం కాదు, టీటీడీ పాలక మండలి అంటే మాకు చాలా గొప్ప గౌరవం ఉంది.

తిరుపతి దేవుడు అంటే ప్రపంచానికే దేవుడు. ఈ ప్రాంతంలో ఉన్నంత మాత్రాన మాది అని దేవుని విషయంలో అనుకోవద్దు, అలా అనుకుంటే ఆ దేవునికి కూడా కోపం వస్తుంది. తెలంగాణ, ఆంధ్ర ప్రజలకు, నాయకులకు, వ్యాపారవేత్తలను ఒకే మాదిరిగా ఉండాలి. అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సరిచేయవలసిన బాధ్యత ఉంది. గత 10 సంవత్సరాలలో హైదరాబాద్ లో కానీ, తెలంగాణ లో ఆంధ్రా ప్రజలను కానీ వ్యాపారస్తులను కానీ భేదాభిప్రాయాలు లేకుండా చూడడం జరిగింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో ఆంధ్రా వ్యాపారస్తులే లాభపడ్డాడు. తెలంగాణలో టీటీడీకి కళ్యాణ మండపాల కొరకు స్థలాలు ఇవ్వడం గొప్ప సంకల్పంగా, అదృష్టంగా భావిస్తాం. వచ్చే భక్తులకు రూమ్స్, దర్శనంలో చాలా ఇబ్బందులు పడుతున్నాము. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఇచ్చిన మాదిరిగా తిరుమల కొండ పైన కాటేజ్ నిర్మాణానికి తెలంగాణకు 1 ఎకరం స్థలం ఇవ్వాలని గతంలో కోరడం జరిగింది. టీటీడీ పైన అపారమైన గౌరవంతో తెలపడం జరిగిందని మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *