అసెంబ్లీలో భట్టీకి ఇచ్చి పడేసిన హారీష్ రావు..!

 అసెంబ్లీలో భట్టీకి ఇచ్చి పడేసిన హారీష్ రావు..!

Harish Rao was thrown into the furnace in the assembly..!

బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో 4 లక్షల 17 వేల కోట్లు అప్పు చేస్తే.. కాంగ్రెస్ పార్టీ మొదటి సంవత్సరంలోనే 1 లక్ష 27 వేల కోట్లు అప్పు చేసింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన 72 వేల కోట్లు అప్పు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ల ద్వారా వచ్చిన 11 వేల కోట్ల అప్పు, భట్టి గారు కలిపిన 15 వేల కోట్లు మొత్తం లక్ష కోట్లు బీఆర్ఎస్‌కు సంబంధం లేని అప్పును కలిపారు అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు.

అసెంబ్లీలో జరిగిన అప్పుల అంశంపై ఆయన మాట్లాడుతూ గవర్నమెంట్ గ్యారెంటీ ఇవ్వని, గవర్నమెంట్ కట్టవలిసిన అవసరం లేని అప్పు 59 వేల కోట్లు.. గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చి, గవర్నమెంట్ కట్టవలిసిన అవసరం లేని అప్పు 95 వేల కోట్లు.కాంగ్రెస్ పార్టీ శ్వేతా పత్రంలో చూపిస్తున్న 6.71 లక్షల కోట్ల అప్పులో.. మేము తీసుకోని అప్పు, ప్రభుత్వం కట్టాల్సిన అవసరం లేని అప్పు మొత్తం తీసేస్తే బీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో అచ్చంగా చేసిన అప్పు 4.17 లక్షల కోట్లు మాత్రమే.

ఈ 4.17 లక్షల కోట్లలో కరోనా కష్ట కాలంలో తీసుకున్న గ్రాంట్స్ కూడా ఇందులోనే ఉన్నాయి.కానీ కాంగ్రెస్ పార్టీ మొదటి సంవత్సరంలోనే 1.27 లక్షల కోట్లు అప్పు చేసింది అని లెక్కలతో డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లుకు ఇచ్చి పడేశారు మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *