కాంగ్రెస్ అంటేనే ప్రజలకు భద్రత.. భరోసా..?
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోచ్చిన ధరణి పోర్టల్ కు బదులుగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకోచ్చిన సంగతి తెల్సిందే. దీనికి సంబంధించిన బిల్లును రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు బుధవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టారు.
ఈ బిల్లు గురించి జరుగుతున్న చర్చలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ” ధరణిని ఆర్ధరాత్రి ప్రమోట్ చేశారు. ధరణిలో అనేక లోపాలున్నాయి. రెవిన్యూ అధికారుల దగ్గర పరిష్కారం కావాల్సిన భూసమస్యలు సైతం కోర్టులకు వెళ్లాయి.
సమస్యలు తీర్చాలని తీసుకోచ్చిన ధరణి చట్టంతోనే కొత్త భూసమస్యలు వచ్చాయి. భూభారతి చట్టంతో ప్రజల భూములకు భద్రతగా ప్రభుత్వం ఉంటుంది. కాంగ్రెస్ అంటేనే ప్రజలకు భద్రత.. భరోసా అని అన్నారు.