టీమిండియా ఆలౌట్..!
ఆసీస్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఆలౌటైంది. ఐదో రోజు బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 260పరుగులు చేసి మిగతా వికెట్లను సైతం కొల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 185పరుగుల ఆధిక్యాన్ని దక్కించుకుంది.
ఇండియా జట్టులో కేఎల్ రాహుల్ 84, రవీంద్ర జడేజా 77, ఆకాశ్ దీప్ 31 పరుగులతో రాణించారు. మరోవైపు ఆసీస్ బౌలర్లలో కమిన్స్ నాలుగు, స్టార్క్ మూడు వికెట్లను పడగొట్టారు. హెజిల్ వుడ్ , హెడ్,లియోన్ తలో వికెట్ తీశారు.
ఈ రోజే చివరి రోజు కావడంతో ఈ మ్యాచ్ డ్రా అవుతుందా లేదనేది చూడాలి. అయితే ఇండియా ఆలౌటైనాక వర్షం మరోకసారి అంతరాయం కలిగించింది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభమయ్యే సమయానికి ఆకాశం మేఘావృతమై ఉరుములు రావడంతో అంపైర్లు మ్యాచ్ ను నిలిపివేశారు.