మండుటెండలో మధ్యాహ్న భోజనం
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో విద్యార్థులు నిన్న మంగళవారం మండుటెండలో మధ్యాహ్న భోజనం చేసిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఈ బడిలో దాదాపు 250 మందికిపైగా విద్యార్థులు ఉండగా.. పాఠశాల ఆవరణ, తరగతి గదుల్లో భోజనం చేస్తున్నారు. గతంలో కేసీఆర్ సర్కారు ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగం గా డైనింగ్ హాల్ మంజూరు చేసింది.
పనులు ప్రారంభమై గోడలు కూడా కట్టారు. ఇంతలోనే కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రావడంతో పనులు నిలిచిపోయాయి. దీంతో తినడానికి కనీసం నీడ కూడా లేకపోవడంతో మండుటెండల్లోనే భోజనం చేస్తున్నారు. ఈ సంఘటనపై పలువురు అగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిగా కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వ బడులను గురుకులాలను గాలికొదిలేసిన సంఘటనలు పలుమార్లు మనం వార్తల్లో చూస్తున్న సంగతి తెల్సిందే.