మంచు వివాదంలో ట్విస్ట్…!
మంచు కుటుంబ వివాదంలో రోజుకో ట్విస్ట్ నమోదవుతుంది. ఇటీవల హీరో మంచు మనోజ్ ఏర్పాటు చేసిన ఓ పార్టీ సందర్భంగా తన అన్న హీరో మంచు విష్ణు తన ఇంట్లో ఉన్న జనరేటర్ లో చక్కెర పోశాడని హీరో మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన సంగతి తెల్సిందే.
ఈ అంశంలో ఎవరూ ఊహించని ట్విస్ట్ నమోదైంది. మనోజ్ తల్లి గారైన నిర్మల మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగో తారీఖున తన పుట్టిన రోజు సందర్భంగా జల్ పల్లిలోని ఇంటికి వచ్చిన విష్ణు ఎలాంటి గొడవలు చేయలేదు.
కేక్ తీసుకొచ్చి నా పుట్టిన రోజును సెలబ్రేట్ చేసి వెళ్ళిపోయాడని ఆమె స్పష్టం చేశారు. విష్ణు గొడవ చేసినట్లు చిన్న కొడుకు మనోజ్ పిర్యాదు చేసినట్లు తన దృష్టికి వచ్చింది. అతని ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవు అని ఆమె రాచకోండ పోలీసులకు లేఖ రాశారు.