భట్టీ కి హారీష్ రావు అదిరిపోయే కౌంటర్..!
తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లుకి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఆధారాలతో అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు మాట్లాడూతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం అరవై ఆరు వేల కోట్ల రూపాయలను వడ్డీలకు కడుతుంది అని అన్నారు.
దీనికి కౌంటర్ గా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడూతూ ఆర్బీఐ నివేదిక ప్రకారంగా రూ.2900 కోట్లు వడ్డీ కడుతున్నారు. కాగ్ నివేదిక ప్రకారంగా రూ.2100 కోట్లు మాత్రమే మిత్తి కడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి.
వీటన్నింటిని పక్కన పెట్టి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభను తప్పుదోవ పట్టిస్తూ రూ.66 వేల కోట్లంటూ తప్పుడు లెక్కలు చెబుతున్నారు అని అదిరిపోయే కౌంటరిచ్చారు. కాంగ్రెస్ ఏడాదిగా చేసిన అప్పులతో ఏమి చేశారంటే సమాధానం లేదని ఆయన ఫైర్ అయ్యారు.