అసెంబ్లీలో భట్టీ వర్సెస్ హారీష్ రావు.!
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టీ మాట్లాడుతూ ” బీఆర్ఎస్ కు స్పీకర్ అంటే గౌరవం లేదు. సభ అంటే మర్యాద లేదు.
బీఏసీ సమావేశాన్ని బైకాట్ చేసి మరి బీఆర్ఎస్ బయటకు వెళ్లింది. మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు.
గత ప్రభుత్వ అప్పులపై సభలో వాస్తవాలనే ఉంచాము. బీఆర్ఎస్ లక్షల కోట్ల అప్పులను చేసింది. బీఆర్ఎస్ నేతలు వాస్తవాలను మాట్లాడటం లేదు. ప్రజల కోసం పని చేస్తుంటే ప్రివిలేజన్ మోషన్ ఇస్తారా అని తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు.