కష్టాల్లో టీమిండియా..!
ఆసీస్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లను కోల్పోయి యాబై ఒక్క పరుగులను చేసింది.
కేఎల్ రాహుల్ (33*), రోహిత్ శర్మ (0*)పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఈరోజు ఆటకు వాన ఆరు సార్లకు పైగా అంతరాయం కలిగించింది. మొదటి ఇన్నింగ్స్ లో ఆసీస్ 445 పరుగులు చేసింది. టీమిండియా ఇంకా 394పరుగులు వెనక బడి ఉంది.