అల్లు అర్జున్ కు అండగా ఎంపీ..?
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు సంధ్య థియేటర్ దగ్గర పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా నెలకొన్న తొక్కిసలాట వ్యవహారంలో హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం అన్యాయమని వైసీపీ నేత.. మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.
ఆయనకు అండగా ఉంటామని చెప్పారు. అల్లు అర్జున్‌తో పాటు పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, రేవంత్‌ను ఆయన ట్యాగ్ చేశారు. కాగా ‘పుష్ప2’ సినిమా విడుదలకు ముందు, ఆ తర్వాత అల్లు అర్జున్‌కు మద్దతుగా అంబటి వరుస ట్వీట్లు చేశారు.
ఆయనను ఎవరూ అణగదొక్కలేరని ట్వీట్లు పెట్టారు.ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేసును వైసీపీ రాజ్యసభ ఎంపీ, న్యాయవాది, నిర్మాత నిరంజన్ రెడ్డి పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది..మరికాసేపట్లో హైకోర్టుకు చేరుకునే అవకాశం ఉందని టాక్.