ఏపీ మంత్రివర్గంలోకి మెగా హీరో…!

ఏపీ నుండి అధికార పార్టీ అయిన టీడీపీ తరపున రాజ్యసభకి పోటి చేసే సభ్యులను ఆ పార్టీ అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు..
రాజ్యసభకు బరిలో దిగే అభ్యర్థులుగా సానా సతీష్,బీద మస్తాన్ రావు పేర్లను టీడీపీ ఖరారు చేసింది.. మరోవైపు బీసీ నేత ఆర్.కృష్ణయ్య పేరును ఇప్పటికే బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసిన సంగతి తెల్సిందే.
ఈ నేపథ్యంలో కూటమిలో మరో పార్టీ అయిన జనసేన నుండి రాజ్యసభకు ప్రాతినిథ్యం లేకపోవడంతో జనసేన కు ఓ మంత్రి పదవి ఇవ్వాలని బాబు నిర్ణయించారు..ఈ నిర్ణయంలో భాగంగా జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబుకు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని చంద్రబాబు అధికారకంగా ప్రకటించారు.. త్వరలోనే నాగబాబు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. .