కేసీఆర్ కు ఆహ్వానం..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని రాష్ట్ర బీసీ సంక్షేమం మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆహ్వానించారు.
ఇదే అంశంపై కేసీఆర్ను ఆహ్వానించడానికి ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బృందానికి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వంశీధర్ రావు తదితరులు సాదర స్వాగతం పలికారు.
తన నివాసానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి లంచ్ ఆతిథ్యమిచ్చి కేసీఆర్ గౌరవించారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీలో జరిగిన ఉద్యమ జ్ఞాపకాలను ఇరువురు నేతలు నెమరు వేసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట ప్రభుత్వ ప్రోటోకాల్, ప్రజా సంబంధాల సలహాదారుడు హర్కర వేణుగోపాల్, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు తదితరులు ఉన్నారు.