ఆటో డ్రైవర్లకు సీఎం రేవంత్ రెడ్డి షాక్..?
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని ఆటో డ్రైవర్లకు బిగ్ షాకిచ్చారు..ఇందులో భాగంగా హైదరాబాద్ మహానగరంలో ఢిల్లీ తరహా పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని రవాణా శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఈ చర్యలకు అనుగుణంగా మహానగరంలో డీజిల్ ఆటోలను నగరం వెలుపల ఉన్న ఓఆర్ఆర్ బయటకు పంపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత మంత్రిత్వ,అధికారులకు సూచించారు.
అయితే వారు ఎలక్ట్రిక్ ఆటోలు కొంటే తగిన ప్రత్యేక పథకం తీసుకొచ్చేలా అధికారులతో మాట్లాడాలన్నారు. ఇలా చేస్తే నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.