పుష్ప -2 మూవీ భారీ విజయం ఖాయమా?
నేషనల్ క్రష్ రష్మీక మందన్నాకు డిసెంబర్ నెల అంటే సెంట్మెంటా…?. ఆ నెల అంటే ఎందుకంతా నేషనల్ క్రష్ కు ఇష్టం..? . అందుకే రష్మిక మందన్నా నటించిన మూవీ పుష్ప -2 చిత్రం భారీ విజయం సాధిస్తుందా .? అంటే ఇప్పుడు చూద్దాము. రష్మీక సినిమాల్లోకి ఎంట్రీచ్చిన మూవీ కిరిక్ పార్టీ డిసెంబర్ నెలలో విడుదలై ఘన విజయం సాధించింది..!.
ఈ చిత్రం రష్మికను ను ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా చేసింది.మరోవైపు కన్నడలో రాజ్ పునీత్ కుమార్ తో నటించిన అంజనీపుత్ర, గణేష్ తో చేసిన చమక్ చిత్రాలు ఇదే డిసెంబర్ నెలలో విడుదలై ఘన విజయం సాధించాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే తాను లేటెస్ట్ గా నటించిన యానిమల్ ,పుష్ప -1 చిత్రాలు సైతం అదే డిసెంబర్ నెలలో విడుదలై ఘనవిజయం సాధించడమే కాకుండా రికార్డులను బద్దలు కొట్టాయి.
తాజాగా తాను హీరోయిన్ గా నటించిన పుష్ప -2 ఇదే డిసెంబర్ నెల ఐదో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నది. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే పుష్ప -2 చిత్రం ఘనవిజయం సాధించడమే కాకుండా మరో చరిత్ర అవుతుందని ఇటు రష్మీక అభిమానులు. అటు బన్నీ అభిమానులు తెగ సంబురపడుతున్నారు.