అభిమాని ఆత్మహత్య – మంత్రి లోకేష్ సమాధానం ఇదే..!
ఏపీ మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు అభిమాని శ్రీను అనే టీడీపీకి చెందిన కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు. తనకు ఉన్న ఆర్థిక సమస్యలతో .. కుటుంబ సమస్యలతో శ్రీను ఆత్మహత్య చేసుకోవడంపై మంత్రి లోకేష్ నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ” ఎప్పుడూ అన్నా అని పిలిచేవాడివి. ఎవరికి ఏ కష్టమోచ్చిన వాళ్లకు సాయం చేయాలని నాకు మెసేజ్ చేసేవాడివి. నా పుట్టిన రోజు.. నా పెళ్లి రోజులను పెద్ద వేడుకలుగా చేసేవాడివి..
నీకు ఆపద వస్తే ఈ అన్నకు మెసేజ్ చేయాలన్పించలేదా ..?. జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశావు తమ్ముడు.ఓ అన్నగా నీ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటా” అని రాసుకోచ్చారు.