డిసెంబర్ 4న ఏపీ క్యాబినెట్ మీటింగ్..!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో క్యాబినెట్ సమావేశం డిసెంబర్ 4వ తేదీన జరగనుంది.
వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరగనుంది.
రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఇసుక పాలసీ, కొత్త పథకాలు, రేషన్కార్డులు, అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ సహా పలు అంశాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.