మంత్రి సీతక్క బీఆర్ఎస్ పై ఆగ్రహం
“అబద్దాల పునాదులతో అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది” అని
దిలావార్ పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు అధికారులపై ఎదురుతిరిగిన నేపథ్యంలో మంత్రి ధనసరి అనసూయ బీఆర్ఎస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు..
మీడియా తో మంత్రి సీతక్క మాట్లాడుతూ
“దిలావార్ పూర్, గుండంపల్లి మధ్యలో ఇథానాల్ ఫ్యాక్టరీ పై కుట్ర జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హాయాంలోనే ఇథానాల్ ఫ్యాక్టరీ కి అన్ని రకాల అనుమతులు వచ్చాయి. మా ప్రభుత్వం వచ్చాక మేము ఎటువంటి పక్రియ చేపట్టలేదు.. అయినా మా ప్రభుత్వం పై కుట్ర చేస్తున్నారు.
దొంగ నాటకాలు, రెచ్చగొట్టడం బీఆర్ఎస్ కు అలవాటు అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్యాక్టరీలు వస్తే గొప్పగా చెప్పుకున్నారు కదా.. ఇథానాల్ ఫ్యాక్టరీకి బీఆర్ఎస్, బీజేపీలు అనుమతులు ఇచ్చింది వాస్తవం కాదా.. ఇథానాల్ ఫ్యాక్టరీలో డైరెక్టర్లుగా బీఆర్ఎస్ నేతలు అయిన తలసాని సాయికుమార్, మరో వ్యక్తి ఉన్నారు.”