వైసీపీ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డిపై పోక్స్ కేసు..!
వైసీపీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్స్ చట్టం కింద కేసు నమోదైంది. మైనర్ బాలికపై అత్యాచార యత్నం జరిగిందంటూ దుష్ప్రచార చేశారు.
తమ పరువుకు భంగం కలిగించారంటూ వైసీపీ నేత.. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై యర్రావారి పాలెం పోలీసులు పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఈ సంఘటనపై బాలిక తండ్రి ఆయనపై పోలీసులు ఫిర్యాదు చేశారు. బాలిక భవిష్యత్తును దెబ్బతీసే చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.