కోహ్లీ సెంచరీ..!
ఆసీస్ తో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మొదటి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటర్లు రెచ్చిపోయారు. ముందుగా ఓపెనర్ జైస్వాల్ 161పరుగులతో రాణించాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ శతకంతో చెలరేగారు.
మొత్తం 143బంతుల్లో ఎనిమిది పోర్లు.. రెండు సిక్సర్ల సాయంతో శతకాన్ని సాధించాడు కోహ్లీ. టెస్ట్ ల్లో ఇది కోహ్లీకి ముప్పై సెంచరీ కావడం విశేషం. రాహుల్ 77,పడిక్కల్ 25,పంత్ 1,జురెల్ 1,సుందర్ 29,నితీశ్ రెడ్డి 38* రాణించడంతో ఆరు వికెట్లను కోల్పోయి 487పరుగులు చేసింది.
భారత్ రెండో ఇన్నింగ్స్ ను 487/6దగ్గర డికెర్ల్ చేయడంతో ఆసీస్ ముందు 534 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్ కు బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ మూడు వికెట్లను కోల్పోయి పన్నెండు పరుగులు చేసింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది.