చెప్పులు లేకుండా నడుస్తున్నారా..?
చెప్పులు ధరించుకుని నడిచేకంటే అవి లేకుండానే నడవటం వల్ల వల్ల అనేక ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
‘పాదాలు నేరుగా నేలను తాకడం వల్ల విశ్రాంతిగా అనిపిస్తుంది. నాణ్యమైన నిద్ర, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
బీపీ కంట్రోల్లో ఉంటుంది. కాలి కండరాలు బలపడతాయి’ అని పేర్కొంటున్నారు. షుగర్ పేషెంట్లు, అరికాళ్ల పగుళ్ల సమస్యలు ఉన్నవారు చెప్పులు లేకుండా నడవొద్దని వారు సూచిస్తున్నారు.