మాజీ మంత్రి రోజా జైలుకెళ్ళడం ఖాయం
నవ్యాంద్ర లో గత ఐదేండ్లు అధికారంలో ఉన్న వైసీపీ హయాంలో ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో మాజీ మంత్రి.. నగరి మాజీ శాసనసభ్యులు ఆర్కే రోజా రూ.వేల కోట్ల ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారని శాప్ ఛైర్మన్ రవినాయుడు ఆరోపించారు.
ఓట్ల కోసం 17 ఏళ్లు పైబడిన వారికే క్రీడల్లో అవకాశం కల్పించారని విమర్శించారు. ఆమె పెద్ద అవినీతి తిమింగలమన్నారు.
తిరుమల దర్శనాల విషయంలోనూ దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు. ఈ రెండు అంశాలపై సీఐడీ విచారణ చేయిస్తామని, కచ్చితంగా ఆమెను జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు.