సూర్య క్రష్ ఎవరో తెలుసా..?
సూర్య ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..?. ఇంకా ఎవరై ఉంటారు.. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న జ్యోతిక అని అంటారా..?. అయితే మీరు పప్పులో కాలేసినట్లే.
ప్రముఖ స్టార్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా లో ప్రసారమై ఆహా ఆన్ స్టాపబుల్ కార్యక్రమంలో హీరో సూర్య తమ్ముడు కార్తీ కు కాల్ చేస్తాడు. కాల్ చేసి సూర్య ఫస్ట్ క్రష్ ఎవరో చెప్పాలని అడుగుతాడు.
దీనికి సమాధానంగా కార్తీ చికుబుకు చికుబుకు రైలు సాంగ్ కు చిందులేసిన సీనియర్ నటి గౌతమీ అని చెప్తాడు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు అంటూ హోస్ట్ బాలకృష్ణ చమత్కరిస్తాడు. దీంతో నువ్వు కత్తి రా కార్తీ కాదు అని సూర్య అనగానే అక్కడున్నవాళ్లంతా నవ్వులు విసిరారు.