That Is విరాట్ కోహ్లీ…!
టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లీ కి దేశ వ్యాప్తంగా ఎంతమంది అభిమానులు ఉన్నారు. వారి అభిమానం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ముంబైలో ఉన్న విరాట్ కోహ్లీని చూసి అభిమానులు సెల్ఫీ కోసం ఎగబడ్డారు.
మళ్లీ వచ్చి అందరితో సెల్ఫీలు దిగుతానని విరాట్ కోహ్లీ చెప్పిన కానీ అభిమానులు వినలేదు. దీంతో వారందరికోరికను మన్నించి ఒక్కొక్కరితో సెల్ఫీలు దిగి అక్కడ నుండి వెళ్లిపోయాడు.
మరోవైపు ఓ మహిళ అయితే ఏకంగా కోహ్లీ అక్కడ నుండి వెళ్ళిపోకుండా తన చేతులతో పట్టుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నెటిజన్లు విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.