సమగ్ర కులాల సర్వే ప్రశాంతంగా జరగాలి

 సమగ్ర కులాల సర్వే ప్రశాంతంగా జరగాలి

సమగ్ర కులాల సర్వే ప్రశాంతంగా ఎటువంటి అనుమానాలు లేకుండా జరిగే విధంగా ఒక మంచి వాతావరణాన్ని సృష్టించడానికి అందరూ ప్రయత్నించాలి.
అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ విభేదాలకు అతీతంగా సహకరించాలి.బీసీ కమిషన్ వద్ద సొంతంగా యంత్రాంగం, సిబ్బంది లేనందున ఈ సమగ్ర సర్వేకు ఒక ప్రభుత్వ డిపార్ట్మెంట్ కు అప్పగించాలని బీసీ కమిషన్ కోరితేనే ప్లానింగ్ శాఖ కు అప్పగించడం జరిగిందని అందరూ గమనించాలి.
ఈ ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమగ్ర కులాల సర్వే ఎటువంటి లోపాలు లేకుండా ప్లానింగ్ శాఖ పూర్తిగా ప్రయత్నించాలని బీసీ కమిషన్ కోరుతుంది.


ఎన్యుమరేటర్స్ ఏ రోజు, ఏ ప్రాంత కుటుంబాలకు వెళతారో స్పష్టంగా ముందస్తు ఆ కుటుంబాలకు సమాచారం అందించే విధంగా సూపర్ వైజర్ లు, పై అధికారులు ప్రయత్నించి కనీసం ఒకరోజు ముందే ఆ సమాచారాన్ని అందించాలి.
ప్రజలు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సమాచారాన్ని అందిస్తేనే బీసీల అసలు సంఖ్య, విద్య, ఆర్థిక, సామాజిక, రంగాలలో ఉన్న వెనుకబాటుతనం తెలుస్తుంది.
ఎన్యుమరేటర్ల ద్వారా సేకరించిన వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచడానికి ప్లానింగ్ శాఖ, కలెక్టర్లు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.ప్లానింగ్ శాఖ సేకరించిన ఈ సమాచారం బీసీ కమిషన్ కు అత్యంత కీలకం. ఈ సమాచారాన్ని సమీక్షించి భవిష్యత్తులో తీసుకోవలసిన టువంటి చర్యలు, సూచనలు గురించి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.


ప్రజలు ఈ విషయాన్ని గమనించి, సమాచార సేకరణకు వచ్చే ఎన్యూమరేటర్లకు అన్ని విధాల సహకరించాలని ఎక్కడైనా ఏదైనా లోపాలుంటే వారు ఇచ్చిన సమాచారం దుర్వినియోగం అయ్యే పరిస్థితులు ఉంటే జిల్లా కలెక్టర్ లకు గాని లేదా బీసీ కమిషన్ కు గాని తెలియజేస్తే తగు చర్యలు తీసుకుంటుంది.
ప్రజలందరూ సరైన సమాచారాన్ని అందించాలి. పౌరులుగా ఇది కనీస బాధ్యత.ఎక్కడైనా, ఎవరైనా అధికారులు గానీ ఎన్యుమరేటర్లు కానీ ప్రజలు కానీ తప్పుడు సమాచారాన్ని నమోదు చేస్తే వారిపై చట్టబద్ధమైన తీవ్రమైన చర్యలు ఉంటాయి. ఈ విషయంలో కమిషన్ నిష్పక్షపాతంగా, కచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తుంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *