సమగ్ర సర్వే పేరుతో దొంగలు వస్తారు జాగ్రత్త…?
తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోచ్చిన మహోత్తర కార్యక్రమం సమగ్ర కుటుంబ సర్వే. ఈ సర్వేలో కులమతసామాజిక ఆర్థిక అంశాల గురించి దాదాపు డెబ్బై ఐదు ప్రశ్నలతో కూడిన ఓ బుక్ లెట్ లో సంబంధిత కుటుంబ యొక్క వివరాలను ఆధికారకంగా తీసుకోబడతాయి.
ఈ సర్వే చేస్తున్నప్పుడు ఎన్యుమరేటర్లు బ్యాంకు సంబంధిత పత్రాలు కానీ వేలిముద్రలు కానీ అడగరు.. తీసుకోరు.. కేవలం వాటికి సంబంధించిన వివరాలను మాత్రమే నమోదు చేస్తారు. అఖరికి ఫోన్ నంబరు అడుగుతారు తప్పా ఓటీపీలాంటి వివరాలను అసలే అడగరు. అయితే సమగ్రకుటుంబ సర్వే పేరుతో సైబర్ మోసగాళ్లు మీ ఊర్లకు మీ ఇండ్లకు వస్తారు జాగ్రత్త..
ఎవరైన అలా వచ్చి మీ బ్యాంకు డీటైయిల్స్ తో పాటు ఓటీపీలాంటివి అడిగితే స్థానిక పోలీస్ అధికారులకు లేదా సైబర్ క్రైం పోలీసులకు పిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. సో ప్రభుత్వం ఏదో మంచి చేయాలని సర్వే చేపడుతున్న తరుణంలో ఇదే అనువుగా భావించి కొంతమంది సైబర్ మోసగాళ్లు ఇలా అవతారమెత్తే అవకాశం ఉన్నదన్నమాట.