మాజీ మంత్రి పై లైంగిక వేధింపులు

Good news for those with ration cards..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.
రాష్ట్రంలోని తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదు చేశారు. ‘మేరుగ నాగార్జున నన్ను లైంగికంగా వేధించారు. నా వద్ద నుంచి రూ.90 లక్షల నగదు విడతల వారీగా తీసుకున్నారు.
డబ్బులు తిరిగి అడిగితే బెదిరిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాకు సాయం చేసి డబ్బులు తిరిగి ఇప్పించాలి’ అని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు.