ఆ హీరోతో డేటింగ్ చేస్తున్న సమంత
సమంత నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మోత మోగిన పేరు. సినిమాల్లో నిన్న మొన్నటి వరకు అగ్రహీరోయిన్ గా నంబర్ వన్ స్థానంలో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత ఎంచుకునే కథల్లో పట్టు లేకపోవడంతో ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వడం అమ్మడుకి అవకాశాలు తగ్గాయి.
అయితే తాజాగా ఓ హీరోతో తాను రిలేషన్షిప్ లో ఉన్నట్లు తెలిపింది. తన ఇన్ స్టా గ్రామ్ లో హీరో వరుణ్ ధావన్ తో రిలేషన్ లో ఉన్నట్లు ఓ ఫోటోను పోస్టు చేసింది.
వరుణ్ ధావన్ ను కౌగిలించుకుని ఉన్న ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ అవుతుంది. గత కొంతకాలంగా సమంత ఓ హీరోతో డేటింగ్ లో ఉందని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. తాజాగా ఆ వార్తలకు అమ్మడు బ్రేకిచ్చి ఆహీరో ఎవరో రివిల్ చేసింది.