వీరేంద్రుడికి హ్యాపీ బర్త్ డే

భారత క్రికెట్లో విధ్వంసం అనగానే గుర్తొచ్చే పేరు లిటిల్ స్టార్ వీరేంద్ర సెహ్వాగ్. అటువైపు ఏ జట్టు అని చూడడు.. ఏ బౌలర్ అని కూడా ఎవరని చూడకుండా మొదటి బంతి నుంచే అటాకింగ్ గేమ్ స్టార్ట్ చేయడం వీరు ప్రత్యేకత.
టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు, వన్డేల్లో డబుల్ సెంచరీ తన పేరిట లిఖించుకున్నారు. అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లలో కలిపి 374 మ్యాచులు వీరూ ఆడాడు..
ఇందులో 17,253 పరుగులు చేశారు. వీటిలో 38 సెంచరీలు, 72 అర్ధసెంచరీలు ఉన్నాయి. నేడు సెహ్వాగ్ పుట్టినరోజు.